Posts

Showing posts from April, 2021

తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ

Image
NIGHT CURFEW IN TELANGANA  రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20వ తేదీ అంటే ఇవాళ్టి నుంచే అమల్లోకి రానుంది.ఈ నెల 30వ తేదీ వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అపుడు పరిస్థితి చూసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాత్రి 8 గంటలకే హోటల్స్‌, బార్లు మూసివేయాల్సి ఉంటుంది. కొన్ని అత్యవసర సేవలను కర్ఫ్యూ మినహాయించారు. లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు నిన్న ఆదేశించిన విషయం తెలిసిందే.

ఏపీ లో కరోనా జోరు!

Image
ఈ జిల్లాలకు అస్సలు వెళ్లొద్దు! ఏపీలో కరోనా తీవ్రత రోజు రోజుకీ క్రమంగా పెరుగుతూ వస్తోంది.. గడచిన 24 గంటల వ్యవధిలో నమోదయ్యే కేసులు భారీగానేపెరుగుతున్నాయి.. ఒక్కరోజు వ్యవధిలో  37,765 నమూనాలను పరీక్షించగా 5,963 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది.   *అత్యధికంగా*        *చిత్తూరు   జిల్లాలో*      :-  1182 గుంటూరు జిల్లాలో.     :-    938 శ్రీకాకుళం జిల్లాలో.      :-    893 ఈస్ట్ గోదావరి జిల్లాలో :-    626 విశాఖ పట్నం              :-    565 నెల్లూరు జిల్లాలో.        :-     491 కర్నూలు జిల్లాలో.        :-    434 ప్రకాశం జిల్లాలో.          :-    280 వైయస్సార్ కడప జిల్లాలో  :- 189 కృష్ణా జిల్లాలో.                   :-  171 అనంతపూర్ జిల్లాలో         :-...

పోలింగ్ ఎఫెక్ట్! నాగార్జున సాగర్ లో భారీ గా కేసులు

Image
నాగార్జున సాగర్ లో‌ పంజా  విసిరిన కరోనా వైరస్. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం లో ,పోలింగ్ రోజున కరోనా  వేగంగా విస్తరించిన వైరస్... టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్ ‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్... టిఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డి కి కరోనా పాజిటివ్... కాంగ్రెస్, బిజెపి నేతలకు‌ కరోనా  పాజిటివ్...  నాగార్జునసాగర్ నియోజకవర్గం లో  భారీగా పెరిగిన కరోనా కేసులు పెద్దవూర 59, హాలియా 66, గుర్రంపోడు11, నిడమనూరు7,   త్రిపురారంలో ఈ రోజు కిట్స్ లేక టెస్టులు చేయలేదు. నాగార్జునసాగర్ లో 17 కేసులుగా నమోదు. మొత్తం ఇవాళ 160 కేసులు నమోదు...

పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్!

Image
Power star pavankalyan tested positive  జనసేన నేత, పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌కి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర,  బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్ కళ్యాణ్‌కి చికిత్స ప్రారంభించినట్లుగా సమాచారం. ఇప్పటికే ఇతర పరీక్షలన్నీ చేయించారనీ, ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నట్లుగానూ, అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది..  కాగా, ఈ నెల 3న తిరుపతి బహిరంగ సభ, 4న ...

NEET EXAM POSTPONED

Image
కరోనా ఎఫెక్ట్.. నీట్ పరీక్ష వాయిదా : కేంద్రం  దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్రం మరో కీలక నిర్ణయం ఏప్రిల్ 18న జరగాల్సిన నీట్‌ పీజీ మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌ యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నామన్న హర్షవర్ధన్ కరోనా పరిస్థితులను బట్టి నీట్ పరీక్షకు కొత్త తేదీని తర్వాత వెల్లడిస్తామని తెలిపిన కేంద్ర ఆరోగ్యమంత్రి

తెలంగాణ లో పదో తరగతి పరీక్షలు రద్దు. ఇంటర్ వాయిదా

Image
10th exams cancelled in telangana  పదో తరగతి పరిక్షలు రద్దు చేస్తూ స్కూల్ఎ డ్యుకేషన్ నుంచి GO విడుదల.... గతంలో మే 17నుంచి పరీక్షలకు షెడ్యుల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. కరోనా పాండమిక్ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఈ నిర్ణయం... మరోవైపు CBSE తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం... తెలంగాణ రాష్ట్రం లో ఇంటర్ సెకండ్ పరీక్షలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన  విద్యాశాఖ.. 15రోజుల్లో రి షెడ్యూల్ తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్న విద్యా శాఖ.. మొదటి సంవత్సరం విద్యార్థులకు 2వ సంవత్సరానికి ప్రమోట్... రెండవ సంవత్సరం విద్యార్థుల్లో మొదటి సంవత్సరానికి సంబంధించిన బాక్ లాగ్స్ కి మినిమం పాస్ మార్కులు వేసి పాస్ చేయనున్నారు... మొదటి ఏడాది విద్యార్థులకు పరీక్షలు లేకుండానే 2nd ఇయర్ కి ప్రమోట్ చేస్తున్నారు... భవిష్యత్ లో అన్ని అనుకూలిస్తే పరీక్షలు నిర్వహిస్తామన్న విద్యాశాఖ...  ఎంసెట్ కి యధావిధిగా 25శాతం వెయిటేజి... ఉంటుంది...

విశాఖ లో ఒకే రోజు రెండు విషాదాలు!

Image
విశాఖ లో ఒకే రోజు రెండు విషాదాలు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి.. మధురవాడ మిథిలాపురి కాలనీ లో ఉన్న ఆదిత్య టవర్స్ ఐదవ అంతస్థులో అర్థరాత్రి వారు నివసించే ఫ్లాట్ లో మంటలు చెలరేగడం కనిపించిందని, వారు సజీవ దహనం అయ్యారని చెబుతున్న స్థానికులు  మృతులు బంగారు నాయుడు , డాక్టర్ నిర్మల  దీపక్ (21) కశ్యప్ (19).. వీళ్ళు ఎన్నారై కుటుంబమని స్థానికులు చెబుతున్నారు..   ఇక రెండో సంఘటన  విశాఖ లో పెందుర్తి మరో దారుణం.చోటు చేసుకుంది.. ఒకే కుటుంబానికి చెందిన 6 గురు  హత్య..  విశాఖ  జిల్లా పెందుర్తి మండలం   జుత్తాడ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ని దారుణంగా చంపేసిన ప్రత్యర్థులు

తీవ్ర వాదుల దాడి లో చూపు కోల్పోయినా .. కోరి పెళ్లి చేసుకుంది

Image
సైనికుడి కి చూపు లేదని తెలిసి.. కోరి పెళ్లి చేసుకుంది! ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌... గతవారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ తాలూకు టేకన్‌పూర్‌లోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అకాడమీలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అది పూర్తయ్యాక అక్కడ పెద్ద ఎత్తున విందు, రకరకాల ఏర్పాట్లూ చేశారు. ఆయన మాత్రం అక్కడ భోజనం చేయడానికి ఇష్టపడలేదు. ఓ ఇల్లాలిని కలిసి మాట్లాడాలనుకున్నారు. ఆమె చేతి వంట రుచి చూడాలని ఆశపడ్డారు. ఇంతకీ ఎవరామె.. ఏమిటామె ప్రత్యేకత? తెలుసుకోవాలంటే చదవాల్సిందే!  ఇంద్రాక్షీ త్రిపాఠి... ఆమెకు అలా పరిచయం చేసుకోవడం ఇష్టముండదు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ సందీప్‌ మిశ్రా భార్య అని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. కారణం సందీప్‌ మిశ్రా దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వీరుడు. భారత సరిహద్దు భద్రతా విధుల్లో హోరాహోరీ పోరాడి చూపు కోల్పోయారు. అయితేనేం దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తికి సేవ చేస్తే మాతృదేశానికి సేవ చేసినట్టు అనుకుంది ఇంద్రాక్షి. పెద్దలు కాదన్నా.. బలవంతంగా ఒప్పించి అతని జీవితంలోకి వచ్చింది. ఆమె కళ్లతో భర్తకు లోకాన్ని చూపిస్తూ... ఆనందంగా వైవాహిక జీవితంలో సాగిపోతోంది. ఒక...

క్వారంటైన్ లోకి పవన్. ర్యాలీ రద్దు బీజేపీ కి షాక్!

Image
క్వారంటైన్ లోకి పవన్.. షాక్ లో బీజేపీ! తిరుపతి ఉప ఎన్నిక వేళ బీజేపీ - జనసేన కూటమి కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తో కలిసి పవన్ ప్రచార ర్యాలీ లో పాల్గొనాల్సివుంది... పవర్ స్టార్ క్వారంటైన్ లో వెళ్లడం తో ప్రచారం లో ఉన్న బీజేపీ నేతలు షాక్ తిన్నారు... వివరాల్లోకి వెళితే.....  జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత సిబ్బంది, ముఖ్య కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బందిలో పలువురు కరోనా బారిన పడటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా, డాక్టర్ల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. క్వారంటైన్ నుంచే రోజూవారీ విధులను, పార్టీ కార్యక్రమాలను పరిశీలించనున్నారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ  నాయకులతో మాట్లాడనున్నారని ప్రకటనలో తెలిపారు.

జూలై 8 న షర్మిల పార్టీ. ఏప్రిల్ 15 నుంచి దీక్ష

Image
Sharmila khammam meeting succeed జూలై 8 వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున కొత్తపార్టీ* ప్రకటన.. *ఏప్రిల్ 15 నుంచి హైదరాబాద్ లో మూడురోజులు నిరాహారదీక్ష* చేస్తానని ప్రకటించిన వైఎస్.షర్మిల.. షర్మిల ప్రసంగం లో ముఖ్యంశాలు  *ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణాన్ని..* ‘‘రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు. అన్నీ ఒక తాను ముక్కలే. నువ్వు కొట్టినట్లు చెయ్యి‌.. నేను ఏడ్చినట్లు చేస్తాను అన్నట్లుంది వారి పరిస్థితి.  జనం తరఫున పాలక పక్షాన్ని ప్రశ్నించే బలమైన గొంతుగా మన పార్టీ ఉంటుంది. తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పంపితే మేం రాలేదు. సింహం సింగిల్‌గానే వస్తోంది. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై వస్తున్నా. మేం ఏ పార్టీ కిందా పనిచేయం. పదవులు వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తామని మాటిస్తున్నా.  మా సంకల్పానికి మీ ఆశీస్సులు అవసరం. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు. అధికార పార్టీకి భయపడొద్దు. ప్రజల పక్షాన పోరాటాలు చేయండి. కష్టమొస్తే అండగా నిలబడతా. రాజన్న నుంచి సంక్రమించిన ధైర్యముంది. చేయిచేయి కలిపి రాజన్న పాలన తీసుకొద్దాం’’ అని...

పవన్ ఫ్యాన్స్ దాహం తీరింది!సందేశాత్మక చిత్రం

Image
Vakeelsaab genuine review  పింక్' సినిమా చూసిన చాలా మంది పవన్ కల్యాణ్ ఇమేజ్​కు ఆ సినిమా ఎంత వరకు సూట్ అవుతుంది? రాజకీయాలతో తీరిక లేకుండా ఉన్న పవన్ సినిమాల్లో మళ్లీ నాటి సత్తా చూపించగలడా? మహిళా సాధికారత నేపథ్యంగా నడిచే కథతో పవన్ అభిమానులను మెప్పించగలడా? అనే సందేహాలు వచ్చాయి. ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు, సందేహాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన 'వకీల్ సాబ్' ఎలాంటి న్యాయం చేశాడో చూద్దాం. దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల్లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనే విషయాన్ని ప్రశ్నిస్తుంది 'వకీల్ సాబ్' చిత్రం. ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది? సామాన్యుల పరిస్థితి ఏంటనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. మధ్యతరగతి కుటుంబాల్లోని అమ్మాయిల మాన ప్రాణాలకు ఈ సమాజంలో ఎంత గౌరవం ఉందనేది కూడా అద్దంపడుతుంది. అయితే ఈ చిత్రంలో హిందీ, తమిళంలో విడుదలైనప్పటికీ ప్రతి భాషలో విడుదల చేయాల్సిన బలమైన కథ ఇది. నిర్భయ, దిశ చట్టాలెన్ని వచ్చినా ఆడపిల్లలను చూసే విధానం మారాలని చెప్పే కథ. సమాజంలో మార్పునకు కారణమయ్యే ఇలాంటి కథను తెలుగులో రీమేక్ చేయడం అనేది దర్శకనిర్మాతలను అభినందించాల్సిందే . పవన్ కల్య...

Cobra jawan rakeshsingh released

Image
రాకేష్ సింగ్ ను విడిచిపెట్టిన మావోలు  తమ వద్ద బందీగా ఉన్న కోబ్రా కమాండర్‌ రాకేశ్వర్‌ సింగ్‌ను మావోయిస్టులు విడుదల చేసింది. గత వారం బిజాపూర్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాకేశ్వర్‌ సింగ్‌ను తమతోపాటు మావోయిస్టులు తీసుకెళ్ళారు. గత అయిదు రోజుల నుంచి తమ వద్ద బందీగా ఉంచుకున్న రాకేశ్వర్‌ సింగ్‌ను తెర్రం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. దీన్ని చత్తీస్‌ఘడ్‌ పోలీసులు కూడా ధృవీకరించారు. కాసేపట్లో ఆయన బెటాలియన్‌కు చేరుకునే అవకాశముంది. ఆయన విడుదల తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. 

లంకెబిందెల్లో 5 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా..

Image
లంకెబిందెల్లో 5 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా..! జనగామ జిల్లా పెంబర్తిలో లంకెబిందెలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన నర్సింహా అనే రైతు తన భూమిని చదును చేస్తుండగా లంకె బిందెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా అందులో సుమారు 5 కిలోల బంగారం ఉండటంతో రైతు  అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని అధికారులకు సమాచారమందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు లంకెబిందెలు స్వాధీనం చేసుకుని పరిశీలించారు.

టీటీడీపి కి షాక్! టీఆర్ఎస్ లోకి ఏకైక ఎమ్మెల్యే మచ్చా

Image
Ttdp mla machha nageswarrao join in trs టీఆర్ఎస్ ఎల్ఫీ లోకి టీడీపీ ఎల్ఫీ విలీనం  టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వ‌ర‌రావు టీడీపీకి రాజీనామా.. టీఆర్ ఎస్‌లో చేరిక‌. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భేటి...?  టీడీపీ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టీఆర్ ఎస్‌లో విలీనం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌. ఈమేర‌కు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి లేఖ‌. లేఖ‌ను స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌తో క‌ల్సి స్పీక‌ర్‌కు అందించిన మచ్చ నాగేశ్వ‌ర‌రావు. శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో కూడ భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వ‌ర‌రావు. మ‌రికాసేప‌ట్లో టీడీఎల్పీ విలీనంపై అధికారిక బులిటెన్ జారీ చేయ‌నున్న శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచార్యులు

ఉత్కంఠ కు తెర! పరిషత్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.

Image
BIG RELIEF FOR YSJAGAN GOVT సింగిల్ బెంచ్ తీర్పు ను కొట్టేసిన డివిజన్ బెంచ్ ఏపీ లో ఎన్నికలు యథాతథం...  *ఏపీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్* సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన డివిజన్ బెంచ్ ఈ సమయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు ఎన్నికల నిర్వహణకు తొలగిన అడ్డంకి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు... ఫలితాలు ప్రకటించొద్దన్న హై కోర్టు..  *హై కోర్ట్ అదేశాలతో రేపు యధావిధి గా పోలింగ్* *ఏర్పాట్లను వేగవంతం చేసిన అధికారులు* *ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేసి సిబ్బందిని తరలించాలని SEC ఆదేశం* ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ రాష్ట్ర వ్యాప్తం గా 513 జడ్పీటీసీలు, 7230 ఎంపీటీసీ స్థానాలకు రేపు పోలింగ్ Zptc బరిలో 2092 మంది అభ్యర్థులు...ఎంపీటీసీ బరిలో 19002 మంది అభ్యర్థులు 33663 పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కు వినియోగించుకొనున్న 2 కోట్ల 82, 15 వేల 104 మంది ఓటర్లు. ఎన్నికల విదుల్లో 2 లక్షల 1 వెయ్యి 978 మంది సిబ్బంది. ఇప్పటికే ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ. ఏకగ్రీవాలతో ఊపు మీద వైసీపీ పోటీలో ఉంటామంటున్న జనసేన, బీజేపీ, వామపక్షాలు

సీఎం ను కలిసిన రమణ దీక్షితులు! అయ్యా మీకు రుణపడి ఉంటాం.

Image
సీఎం ను కలిసిన రమణ దీక్షితులు  టీటీడీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, ఇతర అర్చకులు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల, తిరుపతి దేవస్ధానాల పరిధిలోని తిరుమల వేంకటేశ్వరస్వామి, తిరుపతి గోవిందరాజ స్వామి, తిరుచానూరు పద్మావతి అమ్మవార్ల ఆలయాలకు సంబంధించిన 15 మందికి వంశపారంపర్యాన్ని పునరుద్దరించడంపై కృతజ్ఞతలు తెలియజేశారు.

ఏపీ లో పరిషత్ ఎన్నికలకు బ్రేక్!

Image
ఏపీ లో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్! హైకోర్టు స్టే! ఏపీ లో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు కోడ్ విధించలేదని ఆక్షేపణ. కనీసం 4 వారాల పాటు కోడ్ విధించాలన్న నిబంధన పాటించలేదంటూ ఆక్షేపణ... ఈ నెల 15 లోపు అఫిడివిట్ దాఖలు చేయాలనీ ఆదేశం... కోడ్ పై, నోటిఫికేషన్ పై కోర్టు కెళ్ళిన టీడీపీ, బీజేపీ, జనసేన..  తేదేపా దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఉత్తర్వులు.

RRR STORY LEAKED!! దొంగగా జూ.ఎన్టీఆర్ పోలీస్ పాత్రలో చరణ్

Image
ఆర్ఆర్ఆర్ కథ ఇదేనా!... దొంగగా జూనియర్ ..పోలీస్ పాత్రలో చరణ్ ! తెలుగు ఇండస్ట్రీ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కి సంబంధించి రోజు రోజుకు కొత్త కొత్త అప్ డేట్స్ వస్తున్నాయి.. ఇది పూర్తి స్వాతంత్ర్య సమరంలో భాగంగా ఇద్దరు యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం అని అందరూ అనుకుంటున్నారు.. అయితే ఆర్ఆర్ఆర్ అసలు కథ అది కాదనే  టాక్ వినిపిస్తోంది.. దీనికి సంబంధించి లేటేస్ట్ అప్ డేట్ మోసుకొచ్చింది మీ అదీ సంగతి... ఈ సినిమాతో అల్లూరి సీతారామరాజుకి, కొమురం భీం కు సంబంధం ఉన్నప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ దొంగగా.. రామ్ చరణ్ పోలీస్ గా కనిపిస్తారట..   అసలు రాజమౌళి ట్రిపులార్‌ కథను ఎలా మలిచి ఉంటాడనే దానిపై ఇండస్ట్రీలో పలు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఫిక్షనల్‌ పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ కలుసుకుని ఎలా పోరాటం చేశారనేదే కథ అని విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది.. చరిత్ర చూస్తే...  నిజానికి వీరిద్దరూ అసలు కలుసుకోలేదు. కానీ కలుసుకుని స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఎలా ఉంటుందనేదే కథాంశంగా ఊహించుకుని కథ త...

Please leave my father !మా నాన్నను వదిలిపెట్టండి. ప్లీజ్.. వీడియో వైరల్..

Rakeshsingh daugher appeal to maiosts  చత్తీస్ ఘడ్ కాల్పుల ఘటన తర్వాత నక్సలైట్లు రాకేష్ సింగ్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ ని తమ వెంట తీసుకెళ్లారు.  ఈ విషయాన్ని స్వయంగా నక్సల్స్, జర్నలిస్ట్ లకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. https://youtu.be/ZfNXiSGgxbU రాకేష్ సింగ్ బతికే ఉన్నాడన్న సంతోషంతోపాటు.. ఆయన నక్సల్స్ దగ్గర బందీగా ఉన్నారన్న వార్త కుటుంబాన్ని కలచి వేసింది.  రాకేష్ సింగ్ కుమార్తె ఏడుస్తూ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో కోసం కింది link open చేయండి https://youtu.be/ZfNXiSGgxbU

Ramana dikshithulu again as ttd main priest!!

Image
మళ్ళీ టీటీడీ ప్రధాన అర్చకుడి గా రమణ దీక్షితులు!?  *టిటిడి సంచలన నిర్ణయం: రిటైర్డ్ అర్చకులు విధుల్లోకి చేరాలని ఆదేశం* తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది రిటైర్డ్ అర్చకులను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటుగా మిగతా అర్చకులు కూడా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది టీటీడీ. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ పేర్కొన్నది. టీటీడీ నిర్ణయంతో గతంలో రిటైర్డ్ అయ్యిన రమణ దీక్షితులు తిరిగి ప్రధాన అర్చకుల హోదాలో ఆలయప్రవేశం చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు ఆ పోస్ట్ లోనే కొనసాగుతారా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. టీటీడీ నిర్ణయం పట్ల మాజీ అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Curfew in pune carona effect

పూణే లో కర్ఫ్యూ త్వరలో లాక్ డౌన్! CURFEW CARONA మహారాష్ట్రలో కరోనా ఉధృతి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పూణె నగరంలో కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. ఏప్రిల్ 3 నుంచి నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నట్లు పూణె డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు ప్రకటించారు. సాయంత్రం 6 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు 12 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. వారం రోజుల తర్వాత వచ్చే శుక్రవారం పరిస్థితిని సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఏడు రోజుల పాటు బార్లు, హటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లను మూసివేయనున్నట్లు తెలిపారు. ఫుడ్ హోం డెలివరీని మాత్రం అనుమతించనున్నట్లు వెల్లడించారు.వివాహ కార్యక్రమాలు, అంత్యక్రియలు మినహా ఇతర ఏ ఫన్షన్లను అనుమతించబోమని స్పష్టంచేశారు. అంత్యక్రియల్లో అత్యధికంగా 20 మందికి, వివాహ కార్యక్రమాల్లో అత్యధికంగా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అలాగే పూణెలోని అన్ని ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలను పూర్తిగా మూసివేయనున్నట్లు సౌరభ్ రావు ప్రకటించారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం నుంచి ఏప్రిల్ 9 తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే నాగ్‌పూ...

Nagaruguna wilddog review! Rating

Image
నాగార్జున  వైల్డ్ డాగ్ హిట్టా! ఫట్టా! రివ్యూ..    ఫలితాల గురించి ఆలోచించకుండా ప్రయోగాలు చేయడంతో నాగార్జున తరువాత ఎవ్వరైనా. అలాంటి కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ అనే చిత్రంతో నేడు (ఏప్రిల్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరీ ఈ కథ ఎంత వరకు ప్రేక్షకులను మెప్పించింది.. అందులో నాగార్జున వైల్డ్ డాగ్‌గా ఎంత వరకు ఆకట్టుకున్నాడనేది చూద్దాం..  మన ఇండియాలో బాంబ్‌ బ్లాస్ట్ జరుగుతుంది. దీంతో ఉలిక్కి పడ్డ ఇండియన్‌ గవర్నమెంట్‌ ఈ కేసుని ఎన్‌ఐఏకి అప్పగిస్తుంది. ఇక వైల్డ్ డాగ్‌గా పాపులర్‌ అయిన విజయ్‌ వర్మ(నాగార్జున)కి ఎన్‌ఐఏ బృందానికి లీడ్‌గా వ్యవహరిస్తుంటాడు. మొదటి బ్లాస్ట్ జరిగిన పుణేలోని జాన్స్ బేకరీకి చేరుకుంటుంది. అనంతరం దేశ వ్యాప్తంగా వరుసగా బ్లాస్ట్ లు జరుగుతుంటాయి. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా టీమ్‌ నేపాల్‌ కి కూడా వెళ్లాల్సి వస్తుంది. మరి ఈ క్రమంలో ఎన్‌ఐఏ టీమ్‌ ఎలా వ్యవహరించింది. టెర్రరిస్ట్ లను పట్టుకునేందుకు ఏం ప్లాన్‌ చేసింది? నాగార్జున ఎందుకు సస్పెండ్ అయ్యారు? వరికి అసలైన టెర్రరిస్ట్ ని పట్టుకున్నారా? సినిమా ఎలాంటి సొల్యూషన్‌ ఇస్తుంది? అనేది మిగిలిన కథ. ఇక సెకండాఫ్‌లో నాగార్జున ట...

ఏప్రిల్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు

Image
ఏప్రిల్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! ఏప్రిల్‌లో మీకు బ్యాంకులో ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే ఒక గమనిక. ఏప్రిల్‌లో నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. అంటే ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది కేవలం 18 రోజులే. మీరు ఈ సెలవులకు అనుగుణంగా ముఖ్యమైన పనులను పూర్తీ చేసుకుంటే మంచిది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలలో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు పాటు పనిచేయవు. ఈ 12 రోజులలో, 6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6 సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వంటివి ఉన్నాయి. ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు: ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 4: ఆదివారం ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు ఏప్రిల్ 10: రెండవ శనివారం ఏప్రిల్ 11: ఆదివారం ఏప్రిల్ 13: ఉగాది పండుగ ఏప్రిల్ 14: డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 18: ఆదివారం ఏప్రిల్ 21: శ్రీరామ నవమి ఏప్రిల్ 24: నాల్గవ శనివారం ఏప్రిల్ 25: ఆదివారం

ఏప్రిల్ 8న జెడ్పి ఎన్నికలు. కొత్త సీఈసీ గ్రీన్ సిగ్నల్

Image
ఏపీ లో ఏప్రిల్ 8న జెడ్పి ఎన్నికలు. ఇప్పటికే 126 ఏకగ్రీవం! * ఏప్రియల్ 8 న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు...10 న కౌంటింగ్* *నూతన ఎస్ఇసి గా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే జెడ్పీ ఎన్నికలపై కసరత్తులు పూర్తి చేసిన నీలం సాహ్ని* *న్యాయపరమైన చిక్కులు కూడా తొలగడంతో నోటిఫికేషన్ విడుదల* *హైకోర్టు ఆదేశాలు నేపధ్యంలో  ఆగిన చోట నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం* *నూతన ఎస్ ఇసి నీలం‌సాహ్నిని కలిసి ఎన్నికల జెడ్పి నోటిఫికేషన్ పై చర్చించిన సిఎస్ ఆదిత్యనాద్ దాస్* *జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జెడ్పి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తెలుసుకున్న ఎస్ఇసి* *ఎన్నికల నిర్వహణకి సంసిద్దత వ్యక్తం చేయడంతో నోటిఫికేషన్ జారీ* *అభ్యర్ధులు మరణించిన స్ధానాలను‌ మినహాయించి‌ మిగిలిన స్ధానాలలో ఎన్నికలకి నోటిఫికేషన్* *గత ఏడాది మార్చ్ 15  కరోనా కారణంగా జెడ్పి ఎన్నికలు వాయిదా* *వాయిదా పడే సమయానికి నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తి అయిన వైనం* *రాష్ట్ర వ్యాప్తంగా 660 జెట్పిటిసి స్ధానాలకి నోటిఫికేషన్* * 8 జెడ్పిటిసి స్ధానాలకి కోర్టు వివాదాలతో ఆగిన‌ ప్రక్రియ* *మిగిలిన 652 జెడ్పిటిసి స్ధానాలకి 126 జెడ్పిటిసి...