పవన్ ఫ్యాన్స్ దాహం తీరింది!సందేశాత్మక చిత్రం
Vakeelsaab genuine review
పింక్' సినిమా చూసిన చాలా మంది పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు ఆ సినిమా ఎంత వరకు సూట్ అవుతుంది? రాజకీయాలతో తీరిక లేకుండా ఉన్న పవన్ సినిమాల్లో మళ్లీ నాటి సత్తా చూపించగలడా? మహిళా సాధికారత నేపథ్యంగా నడిచే కథతో పవన్ అభిమానులను మెప్పించగలడా? అనే సందేహాలు వచ్చాయి. ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు, సందేహాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన 'వకీల్ సాబ్' ఎలాంటి న్యాయం చేశాడో చూద్దాం.
దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడుల్లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనే విషయాన్ని ప్రశ్నిస్తుంది 'వకీల్ సాబ్' చిత్రం. ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది? సామాన్యుల పరిస్థితి ఏంటనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. మధ్యతరగతి కుటుంబాల్లోని అమ్మాయిల మాన ప్రాణాలకు ఈ సమాజంలో ఎంత గౌరవం ఉందనేది కూడా అద్దంపడుతుంది. అయితే ఈ చిత్రంలో హిందీ, తమిళంలో విడుదలైనప్పటికీ ప్రతి భాషలో విడుదల చేయాల్సిన బలమైన కథ ఇది. నిర్భయ, దిశ చట్టాలెన్ని వచ్చినా ఆడపిల్లలను చూసే విధానం మారాలని చెప్పే కథ. సమాజంలో మార్పునకు కారణమయ్యే ఇలాంటి కథను తెలుగులో రీమేక్ చేయడం అనేది దర్శకనిర్మాతలను అభినందించాల్సిందే.
పవన్ కల్యాణ్ విషయానికొస్తే మూడేళ్ల విరామం ఇచ్చినా ఏ మాత్రం ఆ మేనరిజం తగ్గలేదనే చెప్పాలి. విద్యార్థి నాయకుడిగా, న్యాయవాదిగా మెప్పిస్తూ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. 'వకీల్ సాబ్' సత్యదేవ్ పాత్రకు ప్రాణం పోశారు. పెద్ద పెద్ద సన్నివేశాలు, సంభాషణలంటే వెనకడుగు వేసే పవన్.. ఈ చిత్రంలో మాత్రం దూసుకెళ్లిపోయాడనే చెప్పాలి. న్యాయస్థానంలోని సన్నివేశాలు, సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మెప్పించిన డైలాగ్స్ :
"చీడ పురుగు మగవాడి మెదడులో పెట్టుకొని.. మందు ఆడవాళ్ల మోహం మీద కొడతాం."
"ఆశయం కోసం పనిచేసేవాడికి గెలుపు ఓటములతో పని ఉండదు, ఆవేశమే నీ ఆయుధం, ఓటమంటే అవమానం కాదు.. నిన్ను నువ్వు గెలవడం"
*మూడు సంవత్సరాల తరవాత "పవన్ కళ్యాణ్" ఫాన్స్ కి నచ్చే మెచ్చే సినిమా*
*తన రాజకీయ భవిష్యత్తు కి ఇబ్బంది లేకుండా మహిళల కోసం పోరాడే "వకీల్ సాబ్" గా "పవన్ కళ్యాణ్" చాలా బాగా మెప్పించాడు*
| బలాలు | బలహీనత |
| పవన్ కల్యాణ్ నటన | ప్రథమార్ధంలో ఫ్లాష్‌బ్యాక్ |
| కోర్టు సన్నివేశాలు | ( శృతి హాసన్ ఫ్లాష్ బ్యాక్ ) |
| సంభాషణలు |
ఫైనల్ పంచ్ : అందరూ చూడాల్సిన సందేశాత్మక చిత్రం
VakeelSaab Eyefeast to PawanKalyan Fans after 3 Years..
ADISANGATI RATING 3.5/5

Comments
Post a Comment