Ramana dikshithulu again as ttd main priest!!
మళ్ళీ టీటీడీ ప్రధాన అర్చకుడి గా రమణ దీక్షితులు!?
*టిటిడి సంచలన నిర్ణయం: రిటైర్డ్ అర్చకులు విధుల్లోకి చేరాలని ఆదేశం*
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది
రిటైర్డ్ అర్చకులను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటుగా మిగతా అర్చకులు కూడా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది టీటీడీ.
38118/2018 హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ పేర్కొన్నది.
టీటీడీ నిర్ణయంతో గతంలో రిటైర్డ్ అయ్యిన రమణ దీక్షితులు తిరిగి ప్రధాన అర్చకుల హోదాలో ఆలయప్రవేశం చేయబోతున్నారు.
అయితే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు ఆ పోస్ట్ లోనే కొనసాగుతారా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది.
టీటీడీ నిర్ణయం పట్ల మాజీ అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comments
Post a Comment