లంకెబిందెల్లో 5 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా..
లంకెబిందెల్లో 5 కిలోల బంగారం.. ఎక్కడో తెలుసా..!
జనగామ జిల్లా పెంబర్తిలో లంకెబిందెలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన నర్సింహా అనే రైతు తన భూమిని చదును చేస్తుండగా లంకె బిందెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా అందులో సుమారు 5 కిలోల బంగారం ఉండటంతో రైతు అవాక్కయ్యాడు. వెంటనే తేరుకుని అధికారులకు సమాచారమందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు లంకెబిందెలు స్వాధీనం చేసుకుని పరిశీలించారు.

Comments
Post a Comment