పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్!
Power star pavankalyan tested positive
జనసేన నేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్ కళ్యాణ్‌కి చికిత్స ప్రారంభించినట్లుగా సమాచారం. ఇప్పటికే ఇతర పరీక్షలన్నీ చేయించారనీ, ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నట్లుగానూ, అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది..
కాగా, ఈ నెల 3న తిరుపతి బహిరంగ సభ, 4న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లలో పవన్ కల్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న బండ్ల గణేష్‌లకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ స్వతహాగా క్వారంటైన్‌కి వెళ్లారు. రీసెంట్‌గా బీజేపీ నిర్వహించిన సభలో కూడా ఆయన పాల్గొనలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలుపుతున్నారు.

Comments
Post a Comment