Curfew in pune carona effect
పూణే లో కర్ఫ్యూ త్వరలో లాక్ డౌన్!
CURFEW CARONA
మహారాష్ట్రలో కరోనా ఉధృతి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పూణె నగరంలో కఠిన ఆంక్షలు అమలు చేయనున్నారు. ఏప్రిల్ 3 నుంచి నగరంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నట్లు పూణె డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు ప్రకటించారు. సాయంత్రం 6 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు 12 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. వారం రోజుల తర్వాత వచ్చే శుక్రవారం పరిస్థితిని సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఏడు రోజుల పాటు బార్లు, హటళ్లు, రెస్టారెంట్లు, థియేటర్లను మూసివేయనున్నట్లు తెలిపారు. ఫుడ్ హోం డెలివరీని మాత్రం అనుమతించనున్నట్లు వెల్లడించారు.వివాహ కార్యక్రమాలు, అంత్యక్రియలు మినహా ఇతర ఏ ఫన్షన్లను అనుమతించబోమని స్పష్టంచేశారు. అంత్యక్రియల్లో అత్యధికంగా 20 మందికి, వివాహ కార్యక్రమాల్లో అత్యధికంగా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అలాగే పూణెలోని అన్ని ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలను పూర్తిగా మూసివేయనున్నట్లు సౌరభ్ రావు ప్రకటించారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం నుంచి ఏప్రిల్ 9 తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే నాగ్‌పూర్‌లో లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు.
Comments
Post a Comment