RRR STORY LEAKED!! దొంగగా జూ.ఎన్టీఆర్ పోలీస్ పాత్రలో చరణ్
ఆర్ఆర్ఆర్ కథ ఇదేనా!... దొంగగా జూనియర్ ..పోలీస్ పాత్రలో చరణ్ !
తెలుగు ఇండస్ట్రీ అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కి సంబంధించి రోజు రోజుకు కొత్త కొత్త అప్ డేట్స్ వస్తున్నాయి.. ఇది పూర్తి స్వాతంత్ర్య సమరంలో భాగంగా ఇద్దరు యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం అని అందరూ అనుకుంటున్నారు.. అయితే ఆర్ఆర్ఆర్ అసలు కథ అది కాదనే టాక్ వినిపిస్తోంది.. దీనికి సంబంధించి లేటేస్ట్ అప్ డేట్ మోసుకొచ్చింది మీ అదీ సంగతి... ఈ సినిమాతో అల్లూరి సీతారామరాజుకి, కొమురం భీం కు సంబంధం ఉన్నప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ దొంగగా.. రామ్ చరణ్ పోలీస్ గా కనిపిస్తారట.. అసలు రాజమౌళి ట్రిపులార్ కథను ఎలా మలిచి ఉంటాడనే దానిపై ఇండస్ట్రీలో పలు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ కలుసుకుని ఎలా పోరాటం చేశారనేదే కథ అని విశ్వసనీయ వర్గాల నుంచి తెలుస్తోంది.. చరిత్ర చూస్తే... నిజానికి వీరిద్దరూ అసలు కలుసుకోలేదు. కానీ కలుసుకుని స్వాతంత్ర్యం కోసం పోరాడితే ఎలా ఉంటుందనేదే కథాంశంగా ఊహించుకుని కథ తయారు చేసి 'ఆర్ఆర్‌ఆర్' సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే ... రాజమౌళి ఈ సినిమాను పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు 1897 లో పుట్టి 1924లో చనిపోయారు. అలాగే కొమురం భీమ్ 1901లో పుట్టి 1940లో చనిపోయారు. ఈ ఇద్దరు స్వాతంత్ర్య సమర యోధులు మళ్లీ 1940 ప్రాంతంలో జన్మిస్తారు. 1940లో పుట్టిన అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్... కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ .. బ్రిటీష్ వారిపై పోరాటం చేస్తారు. ఆ కథనే రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.
ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా జక్కన్న కథను రాసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. పునర్జన్మ తర్వాత రామ్‌చరణ్.. పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఓ దొంగ పోలీస్ మధ్య సినిమా ఉంటుంది. వీరిద్దరూ మధ్య మంచి యాక్షన్ ఎపిసోడ్‌ను కూడా జక్కన్న ప్లాన్ చేశాడని టాక్. ట్రిపులార్ చిత్రంలో ఫస్టాఫ్ అంతా ఎక్కువ భాగం ఎన్టీఆర్ మీదనే సినిమా రన్ అవుతుంది. పునర్జన్మలో భాగంగా పుట్టిన ఎన్టీఆర్ పాత్ర దొంగ. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే రామ్‌చరణ్ మీదనే ఎక్కువ కథ రన్ అయ్యేలా.. రాజమౌళి ప్లాన్ చేశారట.. ఫస్టాఫ్ లో ఎన్టీఆర్ .. సెకండాఫ్ లో చరణ్ కనిపిస్తారంటున్నారు.. బాహుబలి సిరీస్ తో ప్రపంచ దృష్టిని ఆకర్శించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.. ఆల్ ది బెస్ట్ ఆర్ఆర్ఆర్ టీం...

Comments
Post a Comment