Cobra jawan rakeshsingh released
రాకేష్ సింగ్ ను విడిచిపెట్టిన మావోలు
తమ వద్ద బందీగా ఉన్న కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు విడుదల చేసింది. గత వారం బిజాపూర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో రాకేశ్వర్ సింగ్‌ను తమతోపాటు మావోయిస్టులు తీసుకెళ్ళారు. గత అయిదు రోజుల నుంచి తమ వద్ద బందీగా ఉంచుకున్న రాకేశ్వర్ సింగ్‌ను తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది.
దీన్ని చత్తీస్‌ఘడ్ పోలీసులు కూడా ధృవీకరించారు. కాసేపట్లో ఆయన బెటాలియన్‌కు చేరుకునే అవకాశముంది.
ఆయన విడుదల తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..


Comments
Post a Comment