జూలై 8 న షర్మిల పార్టీ. ఏప్రిల్ 15 నుంచి దీక్ష
Sharmila khammam meeting succeed
జూలై 8 వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున కొత్తపార్టీ* ప్రకటన.. *ఏప్రిల్ 15 నుంచి హైదరాబాద్ లో మూడురోజులు నిరాహారదీక్ష* చేస్తానని ప్రకటించిన వైఎస్.షర్మిల..
షర్మిల ప్రసంగం లో ముఖ్యంశాలు
*ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణాన్ని..*
‘‘రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు. అన్నీ ఒక తాను ముక్కలే. నువ్వు కొట్టినట్లు చెయ్యి.. నేను ఏడ్చినట్లు చేస్తాను అన్నట్లుంది వారి పరిస్థితి.
జనం తరఫున పాలక పక్షాన్ని ప్రశ్నించే బలమైన గొంతుగా మన పార్టీ ఉంటుంది. తెరాస, భాజపా, కాంగ్రెస్ పంపితే మేం రాలేదు. సింహం సింగిల్‌గానే వస్తోంది. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై వస్తున్నా. మేం ఏ పార్టీ కిందా పనిచేయం. పదవులు వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తామని మాటిస్తున్నా.
మా సంకల్పానికి మీ ఆశీస్సులు అవసరం. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు. అధికార పార్టీకి భయపడొద్దు. ప్రజల పక్షాన పోరాటాలు చేయండి. కష్టమొస్తే అండగా నిలబడతా. రాజన్న నుంచి సంక్రమించిన ధైర్యముంది. చేయిచేయి కలిపి రాజన్న పాలన తీసుకొద్దాం’’ అని పిలుపునిచ్చారు.
*ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే!*
ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఎవరికి ఇష్టమున్నా.. లేకపోయినా తాను తెలంగాణ బిడ్డనే అని షర్మిల చెప్పారు.
ఈ గడ్డమీదే బతికానని.. ఇక్కడి నీరే తాగానన్నారు. తన కుమారుడు, కుమార్తెను తెలంగాణ గడ్డపైనే కన్నానని చెప్పారు.
ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని అనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. బరాబర్ తెలంగాణ కోసం నిలబడతా అని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం కొట్లాడతానని.. అవకాశం ఇవ్వాలో వద్దో వాళ్లే నిర్ణయిస్తారన్నారు.

Comments
Post a Comment