క్వారంటైన్ లోకి పవన్. ర్యాలీ రద్దు బీజేపీ కి షాక్!
క్వారంటైన్ లోకి పవన్.. షాక్ లో బీజేపీ!
తిరుపతి ఉప ఎన్నిక వేళ బీజేపీ - జనసేన కూటమి కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తో కలిసి పవన్ ప్రచార ర్యాలీ లో పాల్గొనాల్సివుంది... పవర్ స్టార్ క్వారంటైన్ లో వెళ్లడం తో ప్రచారం లో ఉన్న బీజేపీ నేతలు షాక్ తిన్నారు... వివరాల్లోకి వెళితే.....
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. పవన్ వ్యక్తిగత సిబ్బంది, ముఖ్య కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బందిలో పలువురు కరోనా బారిన పడటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా, డాక్టర్ల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. క్వారంటైన్ నుంచే రోజూవారీ విధులను, పార్టీ కార్యక్రమాలను పరిశీలించనున్నారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడనున్నారని ప్రకటనలో తెలిపారు.

Comments
Post a Comment