టీపీసీసీ అధ్యక్షుడి గా రేవంత్ రెడ్డి
త్వరలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గా కోమటిరెడ్డి !? పిసిసి అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు,ప్రచారకమిటీ,ఏఐసీసీ వ్యవహారాల కమిటీ నేతలను నియమించిన సోనియాగాంధీ ఐదుగురు వర్కింగ్ ప్రసిడెంట్స్ నియమించిన సోనియాగాంధీ 10 మందిని సీనియర్ ఉపాధ్యక్షులుగా నియామకం ప్రచార కమిటీ చైర్మన్ గా మధు యాష్కీ గౌడ్,కన్వీనర్ గాసయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ నియామకం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌లుగా నియమించింది. కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్.. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబాని, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పోడెం వీరయ్య, సురేశ్ షెట్కార్, వేం నరేందర్ రెడ్డి, రాజేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, జావీద్ అమీర్ నియమితులయ్యారు. కోమటి రెడ్డిని ఏఐసిసి లోకి తీసుకునే చాన్స్.. ఆమేరకు కోమటి రెడ్డికి హామీ ఇచ్చిన అధిష్టానం..! మిగతా సీనియర్లకు భవిష్యత్ లో కీలక పోస్టుల్ల...