మే నెల లో జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు
1 lakh GST collection in month of may
వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్ళు వరుసగా ఎనిమిదో నెల రూ.1 లక్ష కోట్లు దాటాయి. అయితే ఏప్రిల్ తో పోల్చితే ఇది 41 వేల కోట్లు తక్కువ.
ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 మే నెలలో జీఎస్‌టీ రెవిన్యూ వసూళ్ళు రూ.1,02,709 కోట్లు. ఈ విధంగా నెలకు రూ.1 లక్ష కోట్లు పైబడి వసూలు కావడం వరుసగా ఇది ఎనిమిద వ సారి.. జూన్ 4 వరకు వసూలైన జీఎస్‌టీ పైన పేర్కొన్న మొత్తంలో ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్-19 రెండో ప్రభంజనం నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కొన్ని రకాల మినహాయింపులు ఇచ్చిన సంగతిని గుర్తు చేసింది.
అయితే మంత్-ఆన్-మంత్ బేసిస్‌లో చూసినపుడు మే నెలలో జీఎస్‌టీ రెవిన్యూ వసూళ్ళు క్షీణించినట్లు తెలిపింది. ఏప్రిల్‌లో ఇది రికార్డు స్థాయిలో రూ.1.41 లక్షల కోట్లు అని వివరించింది. మే నెలలో వసూలైన ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.53,199 కోట్లు; దీనిలో సరుకు దిగుమతులపై వసూలు చేసిన రూ.26,002 కోట్లు ఉంది. సెంట్రల్ జీఎస్‌టీ రూ.17,592 కోట్లు. కాగా స్టేట్ జీఎస్‌టీ రూ.22,653 కోట్లు వసూలైనట్లు వివరించింది.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనాన్ని అమలు చేయడం వల్ల మే నెలలో జీఎస్‌టీ వసూళ్ళు తగ్గినట్లు నిపుణులు చెప్తున్నారు.

Comments
Post a Comment