Allow ap advocates telangana HC orders
ఏపీ, ఇతర రాష్ట్రాల న్యాయవాదులను అడ్డుకోకండి : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
లాక్ డౌన్ వేళ న్యాయవాదులను అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే వారి క్లర్కులు, స్టెనోలను కూడా అనుమతించాలని సూచించింది. లాక్‌డౌన్ సమయంలో న్యాయవాదులు బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి న్యాయవాదుల రాకపోకలను అడ్డుకోవద్దని స్పష్టం చేసింది.
న్యాయవాదులు, క్లర్కులు కోర్టు ఆదేశాలను దుర్వినియోగం చేయొద్దని ఉన్నతన్యాయస్థానం సూచించింది. గుర్తింపు కార్డు చూపినా న్యాయవాదులను అవమానిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈమేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. #apadvocates #tshighcourt #lockdown
న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.

Comments
Post a Comment