ఇక మండలి లో తిరుగులేని శక్తి గా వైసీపీ!
7 tdp mlcs retirement today
రాష్ట్ర శాసన మండలిలో ఎనిమిది మంది సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. సభ్యుల్లో ఏడుగురు టీడీపీ సభ్యులు ఉన్నారు. టీడీపీ నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, పప్పల చలపతిరావు, గాలి సరస్వతి, జగదీశ్వర్ రావు, వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో మండలిలో వైసీపీ సభ్యుల బలం 21కి పెరగనుండగా...టీడీపీ సభ్యుల సంఖ్య 15కు తగ్గనుంది.
గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్తగా ఎన్నికైన మోషేన్ రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), రమేష్ కుమార్ (కడప) కొత్త ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు. వీరి తో కలిపి బలం 21కి చేరుకుంది

Comments
Post a Comment