తెలంగాణ లో 19 నుంచి నైట్ కర్ఫ్యూ! జూలై 1 నుంచి బార్లు థియేటర్స్
Bars theaters opens likely from july 1st
ఈనెల 19వ తేదీ తరవాత రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షలను సడలించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. వారం నుంచి పది రోజుల పాటు రాత్రి కర్ఫ్యూఊ విధించాలని భావిస్తోంది. అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తారు. వచ్చే నెల నుంచి బార్లు, సినిమా థియేటర్లు, జిమ్‌కు 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా కేసుల, మరణాలు గణనీయంగా తగ్గినందున ప్రభుత్వం అన్‌లాక్ దిశగా ఆలోచిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో పాజటివ్ రేటు 1.5 శాతానికి తగ్గినట్లు పేర్కొంది.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షలను సడలించక తప్పడం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Comments
Post a Comment