Jagan cabinate expansion likely in november! 7 ministers continue
ఆ ఏడుగురు సేఫ్ .. మిగతా మంత్రులపై నిర్ణయం! నవంబర్ లో జగన్ క్యాబినెట్ విస్తరణ
ఏపీలో క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్దమవుతోందా.. ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే వైసీపీలోనూ ముఖ్యంగా ఎమ్మెల్యేల్లో కొత్త మంత్రులుగా ఎవరు ఉంటారనేదానిపై చర్చ మొదలైంది... అయితే 151 సీట్ల బంపర్ మెజార్టీ తో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి .. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే గెలిచిన ఎమ్మెల్యేలతో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.. అందులో మంత్రి వర్గం కూర్పుపై స్ట్రైయిట్ గా క్లారిటీ ఇచ్చేశారు... తొలివిడతలో కొందరిని మంత్రులుగా తీసుకుంటున్నాను.. వీళ్లు మొదటి రెండున్నరేళ్లు మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తారు... మళ్లీ అప్పుడు విస్తరణ జరిపి మిగతా రెండున్నరేళ్లకు కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని చెప్పారు... ఇలా అయితే దాదాపు అందరికి అన్ని సామాజికవర్గాలకు అవకాశం కల్పించినట్లవుతుందని ఉన్నదిఉన్నట్లుగా జగన్ చెప్పేశారు.. ఈ ఏడాది మే 30తో సీఎంగా ఆయన రెండేళ్లు పూర్తి చేసుకున్నారు.. ఆయన చెప్పిన మాట ప్రకారం.. ఈ ఏడాది నవంబర్ లోనే విస్తరణ ఉంటుంది.. దీంతో జిల్లాల్లో అప్పుడే కొత్త మంత్రులు ఎవరనేదానిపై చర్చ మొదలైంది..
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాకా... సరిగ్గా ఏడాది ఒక నెల తర్వాత 2020 జూలైలో చిన్నపాటి విస్తరణ జరిగింది.. మంత్రి మోపిదేవి వెంకటరమణ కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించడంతో ఆయన సామాజికవర్గానికే చెందిన యువ శాసనసభ్యుడు సిదిరి అప్పలరాజు ( పలాస, శ్రీకాకుళం జిల్లా ) కు సీఎం మంత్రిగా అవకాశం కల్పించారు... అలాగే మంత్రి పిల్ల సుభాష్ చంద్రబోస్ కు రాజ్యసభ దక్కడంతో అదే సామాజికవర్గానికి చెందిన చెన్నుబోయిన వేణుగోపాల కృష్ణకు అవకాశం దక్కింది..
అయితే విశ్వసనీయ సమాచారం మేరకు .. ముందుగానే చెప్పినట్లు దాదాపు క్యాబినెట్ లో మెజార్టీ మంత్రులను తొలిగించే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలుస్తోంది... అయితే ఇప్పుడున్న క్యాబినెట్ లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్నినాని, కొడాలినాని, మేకపాటి గౌతంరెడ్డి, కురసాల కన్నబాబులకు తిరిగి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు... అలాగే సిదిరి అప్పలరాజు, చెన్నుబోయిన వేణుగోపాల కృష్ణలు ఈ ఏడాది నవంబర్ కు సంవత్సరంన్నర పూర్తి చేసుకుంటారు కాబట్టి.. వాళ్లకు మరో ఏడాది వరకు అంటే 2022 నవంబర్ వరకు మంత్రులుగా ఉంచుతారని టాక్ వినిపిస్తోంది..
నవంబర్ విస్తరణలో కొత్తగా 16 నుంచి 18 మందికి సీఎం ఛాన్స్ ఇవ్వబోతున్నారు... డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి స్థానంలో విజయనగరం జిల్లా సాలూరు శాసనసభ్యుడు పీడిక రాజన్నదొర కు దాదాపు బెర్త్ ఖాయమంటున్నారు.. అలాగే మల్లాది విష్ణు, అంబటి రాంబాబు, శిల్పా చక్రపాణి రెడ్డి, విడదల రజనీ, గుడివాడ అమర్ నాథ్, బూరి ముత్యాలనాయుడు, సాగి ప్రసాదరాజు, ఆర్కే రోజా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథి పేర్లు వినిపిస్తున్నాయి.
స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా మంత్రివర్గంలో రావాలనుకుంటున్నారంటున్నారు.. మరి సీఎం స్పీకర్ గా కంటిన్యూ చేస్తారా.. లేక మంత్రివర్గంలో తీసుకుంటారా అనే చర్చ కూడా ఆ జిల్లాలో బలంగా సాగుతోంది... #ysjagan #apcabinate #cabinateexpansion
అయితే ఈ సారి విస్తరణలో సామాజిక సమతుల్యత విషయంలో రాజీపడకూడదనే యోచనలో సీఎం ఉన్నట్లుగా తెలుస్తోంది.. కొత్త టీం తోనే 2024 ఎన్నికలు ఎదుర్కోవాలి కాబట్టి సీఎం కు ఈ కూర్పు కత్తి మీద సామె!

Comments
Post a Comment