Posts

Showing posts from March, 2021

ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్ గా నీలంసాహాని

Image
*కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం* *ఆమోద ముద్ర వేసిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్* ప్రస్తుతం సీఎం జగన్ ముఖ్య సలహాదారు బాధ్యతలు చూస్తున్న సాహ్ని ఈ నెలాఖరుతో ముగియనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్న నీలం సాహ్ని

తెలంగాణ లో నో లాక్ డౌన్ : కెసిఆర్

తెలంగాణ లో నో లాక్ డౌన్! కెసిఆర్ క్లారిటీ  తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై  సీఎం కేసీఆర్ క్లారిటీ* తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రజలు భౌతిక దూరం పాటించడం సహా ఇతర కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని.. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమంగా పనిచేస్తోందన్నారు. స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున విద్యాసంస్థలను మూసేశామన్నారు. స్కూళ్ల మూసివేత తాత్కాలికమేనని చెప్పారు.

తిరుపతిలో 'కాపు" కాసెదెవరికి ! 15 శాతం ఓటర్లు వాళ్లే..

Image
తిరుపతిలో 'కాపు" కాసెదెవరికి ! 15 శాతం ఓటర్లు వాళ్లే..  ఏప్రిల్ 17న జరగబోతున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఈ సారి త్రిముఖ పోరు తప్పేలా కనిపించడం లేదు.. చాలా ఈజీగా గెలుస్తాం.. గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో దేశం దృష్టిని ఆకర్షిస్తామని వైసీపీ చెబుతుంటే.. మమ్మల్ని తక్కువ అంచనా వేయోద్దు.. తెరవెనుక జరుగుతోంది మరోకటంటూ బిజెపి అంటోంది.. గట్టి పోటీ ఇస్తామని టీడీపీ చెబుతోంది.. టీడీపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, వైసీపీ నుంచి డా. గురుమూర్తి, బిజెపి నుంచి మాజీ సీఎస్ రత్నప్రభ బరిలో ఉన్నారు... అయితే 16 లక్షల పైచిలుకు ఓటర్లున్న ఈ పార్లమెంట్ పరిధిలో కాపు, బలిజ సామాజికవర్గ ఓటర్లు కీలకం కానున్నారా.. అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది..  ముఖ్యంగా ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ అయినప్పటికీ.. బలిజ సామాజికవర్గం ఓట్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి.. అందుకే గతంలో ఈ పార్లమెంట్ పరిధిలోని తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి సినీనటుడు చిరంజీవి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి గెలుపొందారు. అలాగే జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థికి పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్ని...

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్! రేపో మాపో అధికారిక ప్రకటన

Image
  సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ రేపో మాపో అధికారిక ప్రకటన తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జున సాగర్ నుంచి బరిలో దిగే టీఆర్ఎస్ అభర్థి ఎవరనేదానిపై సస్పెన్స్ కు తెరదిగింది.. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు నోముల భగత్ ను పోటీలో దించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావడమే తరువాయి.. గురవయ్య యాదవ్ పేరు చివరి వరకు పరిశీలనకు వచ్చినా.. ప్రస్తుతం అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు , సామాజిక సమీకరణాల దృష్ట్యా నోముల భగత్ కే టిక్కెట్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారంటున్నారు.. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిగా రంగంలో ఉన్న మాజీ మంత్రి జానారెడ్డిని ఢీకొట్టెందుకు అన్ని రకాలుగా బలమైన అభ్యర్థినే రంగంలో దించాలని సీఎం అనుకున్నప్పటికీ.. అభ్యర్థి ఎవరైనా గెలుపు ఖాయమనే వ్యూహాంతో ముందుకెళ్లాలని .. ఓ నిర్ణయానికొచ్చినట్లు చెబుతున్నారు.. నోముల నర్సింహాయ్య పై చెప్పుకోదగ్గ రీతిలో వ్యతిరేకత లేకపోవడం.. నోముల భగత్ కు టిక్కెటివ్వడం ద్వారా మంచి సంకేతాలు పోతాయని.. దీనికి పక్కా వ్యూహాం తోడైతే ఖచ్చితంగా గులాబీ జెండా రెపరెపలాడుతుందని సీఎం యోచిస్తున్నట్లు చెబుతున్నారు.. గురవయ్య యా...

రఘూరామకృష్ణంరాజు పై సీబీఐ F.I.R

Image
రఘురామకృష్ణంరాజు పై సీబీఐ FIR  వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎస్‌బీఐ చెన్నై బ్రాంచ్‌ డిప్యూటీ జనరల్ మేనేజర్‌ రవిచంద్రన్‌ ఫిర్యాదు చేశారు. ఇంద్‌ భారత్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం రఘురామకృష్ణంరాజు 273.84 కోట్లు రుణం తీసుకుని ఎగవేశారని ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసం చేసి నిధులను దారి మళ్లించినట్టు మేనేజర్‌ రవిచంద్రన్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 23న సీబీఐకి ఫిర్యాదు చేశారు. బుశారం రఘురామకృష్ణరాజు సహా మరో 9 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 

మళ్ళీ మహమ్మారి! 3వ స్థానం లో భారత్

Image
కరోనా పంజా! 3 వ స్థానం లో భారత్  అర లక్ష కు చేరువలో కరోనా కేసులు మహారాష్ట్ర, పంజాబ్,మధ్యప్రదేశ్, గుజరాత్,కర్ణాటక,కేరళ,ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు మహారాష్ట్రలో  31,855 ,పంజాబ్ 2634, లో,కర్ణాటక 2298,కేరళ 2456,తమిళనాడు 1289, గుజరాత్ 1790,ఢిల్లీ 1254 ,రాజస్థాన్ 669 కరోనా కొత్త కేసులు నమోదు కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలు హొలీ వేడుకలను బహిరంగ ప్రాంతాల్లో రద్దు చేసిన మహారాష్ట్ర, ఢిల్లీ,హర్యానా,గుజరాత్,యుపి,బీహార్,ఒడిశా ,చండీఘడ్ ప్రభుత్వాలు

జస్టిస్ ఎన్‌వీ రమణపై జగన్ ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

Image
 *జస్టిస్ ఎన్‌వీ రమణపై జగన్ ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు..* *న్యూఢిల్లీ* సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమరావతి భూముల విషయంలో చేసిన ఈ ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.  సుప్రీంకోర్టు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, అమరావతి భూముల విషయంలో జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబరు 6న సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్-హౌస్ ప్రొసీజర్‌లో విచారణ జరిపి, తగిన విధంగా పరిశీలించి, సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఇన్-హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనది, ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదు. ఈ ఆరోపణలను అఫిడవిట్ ద్వారా కూడా జగన్ సుప్రీంకోర్టుకు సమర్పించారు.  ఇదిలావుండగా, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్‌వీ రమణను నియమించాలని జస్టిస్ బాబ్డే కేంద్ర ప్రభుత్...

తెలంగాణ లో షర్మిల పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?

Image
 షర్మిలా కొత్త పార్టీ భవిష్యత్తేంటీ ? సమగ్ర విశ్లేషణ తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ కొత్త పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్న వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిలా ప్రభావం తెలంగాణ పాలిటిక్స్ పై ఉంటుందా ఉండదా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.. మరి ఆమె కొత్త పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది..  ఇప్పటికే తిరుగులేని ఆధిక్యత, పార్టీ క్యాడర్ , సమర్థవంతమైన నాయకత్వంతో టీఆర్ఎస్ దూసుకుపోతోంది.. మధ్యలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో కారు స్పీడుకు బిజెపి బ్రేక్ వేసినట్లు కనిపించినా.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపుతో కేసీఆర్ మళ్లీ పై చేయి సాధించారు.. ముఖ్యంగా బిజెపి కి అటు ఓటు బ్యాంకు తో పాటు సైద్దాంతిక భావజాలం ఉన్న క్యాడర్ ఎక్కువుగా ఉన్న.. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ చేజిక్కుంచుకోవడంతో కమలనాథులకు కేసీఆర్ భారీ షాకే ఇచ్చారు..  అయితే ఈ మధ్యన వస్తున్న ప్రతి ఫలితంలోనూ కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకపోవడం .. బిజెపి ఓడినా.. టీఆర్ఎస్ కు మాతో గట్టి పోటీ అనేటట్లు రాజకీయం చేస్తుండటంతో తెలంగాణలో రాబోతోంది త్రిముఖ పోరా... లేక ద్విముఖ పోరా అనే సందిగ్ద...

చిక్కుల్లో చంద్రబాబు.. అరెస్టు తప్పదా !

Image
అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రతిపక్ష నేత మాజీ సీఎం చంద్రబాబుకు కష్టాలు తప్పేలా లేవు.. పక్కా ఆధారాలతోనే వైసీపీ సర్కార్ చంద్రబాబు కు ఉచ్చు బిగించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.. ఏ క్షణంలోనైనా ఈ నెల 23 తర్వాత చంద్రబాబు అరెస్టు అయ్యే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు కోడై కూస్తున్నాయి..   అమరావతి రాజధాని భూముల కొనుగోలు అక్రమాలపై ఏపీ సీఐడీ దూకుడు పెంచింది.  చంద్రబాబు నాయుడికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు చేసింది   23వ తేదీ ఉదయం 11గంటలకు విజయవాడ సత్యనారాయణపురం సీఐడీ ఆఫీసుకు రావాలని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరుకాకపోతే సెక్షన్‌ 41A(3)కింద అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు.  అవసరమైన డాక్యుమెంట్లతో రావాలని సూచించిన సీఐడీ అధికారులు.. విచారణకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదదని నోటీసుల్లో వెల్లడించారు. సాక్ష్యులను బెదిరించకూడదని, వారిని సంప్రదించకూడదని సూచించారు. సాక్ష్యాలు నాశనం చేసే ప్రయత్నం చేస్తే చర్యలు చెయ్యరాదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి  గతంలో రాజధాని భూముల కొనుగోలు, అమ్మకాలపై.. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్‌ను సీఐడీ ...