తెలంగాణ లో షర్మిల పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?

 షర్మిలా కొత్త పార్టీ భవిష్యత్తేంటీ ? సమగ్ర విశ్లేషణ





తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ కొత్త పార్టీ ఏర్పాట్లలో బిజీగా ఉన్న వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిలా ప్రభావం తెలంగాణ పాలిటిక్స్ పై ఉంటుందా ఉండదా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.. మరి ఆమె కొత్త పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది.. 


ఇప్పటికే తిరుగులేని ఆధిక్యత, పార్టీ క్యాడర్ , సమర్థవంతమైన నాయకత్వంతో టీఆర్ఎస్ దూసుకుపోతోంది.. మధ్యలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో కారు స్పీడుకు బిజెపి బ్రేక్ వేసినట్లు కనిపించినా.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపుతో కేసీఆర్ మళ్లీ పై చేయి సాధించారు.. ముఖ్యంగా బిజెపి కి అటు ఓటు బ్యాంకు తో పాటు సైద్దాంతిక భావజాలం ఉన్న క్యాడర్ ఎక్కువుగా ఉన్న.. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ చేజిక్కుంచుకోవడంతో కమలనాథులకు కేసీఆర్ భారీ షాకే ఇచ్చారు.. 


అయితే ఈ మధ్యన వస్తున్న ప్రతి ఫలితంలోనూ కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకపోవడం .. బిజెపి ఓడినా.. టీఆర్ఎస్ కు మాతో గట్టి పోటీ అనేటట్లు రాజకీయం చేస్తుండటంతో తెలంగాణలో రాబోతోంది త్రిముఖ పోరా... లేక ద్విముఖ పోరా అనే సందిగ్దత నెలకొంది.. సరైన నాయకత్వం లేకపోయినా.. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి చెక్కు చెదరని క్యాడర్ ఉంది.. కానీ పార్టీలో గ్రూపుల కుమ్ములాటలు.. పార్టీకి నాయకత్వం పరంగా అటు ఓటు బ్యాంకు పరంగా పై చేయిగా ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలే వర్గపోరుతో తన్నుకుంటుడంతో క్యాడర్ కు ఏం తోచడం లేదు.. కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి ఉన్న సాంప్రదాయక ఓటు బ్యాంకు అయిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో దాదాపు 50 శాతానికి పైగా అధికార టీఆర్ఎస్ ఓటు బ్యాంకుగా మారిపోయారు.. మరో వైపు  టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు దాదాపు కేసీఆర్ కు జై కొట్టారు.. ఈ మధ్య కాలంలో కొన్ని బీసీ కులాలపై బిజెపి కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది.. తెలంగాణలో ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్న మున్నూరు కాపు సామాజికవర్గంపై కమలదళం ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ సామాజికవర్గం నేతలు క్రమ క్రమంగా టీఆర్ఎస్ కు వెళ్లారు.. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి కేసీఆర్ ఉన్న ఆ సామాజికవర్గం.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి జై కొట్టింది.. స్థూలంగా ఇలా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కకావికలం అయిపోయింది..


రాష్ట్రంలో విడిపోక ముందు పై వర్గాలన్నీ కాంగ్రెస్ తో ఉండేవి.. ప్రధానంగా వైఎస్సాఆర్ సీఎంగా ఉన్నప్పుడు అటు రాజకీయంగా గానీ పదవుల పరంగా గానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలకు ఆయన పెద్ద పీట వేశారు.. రెడ్డి సామాజికవర్గానికి ఇతర వర్గాలకు మధ్య రాజకీయ రగడ రాకుండా సమతుల్య రాజకీయానికి రాజశేఖర్ రెడ్డి తెరలేపారు.. కానీ ఇప్పుడా పరిస్థితి తెలంగాణలో లేకపోవడం గమనార్హం..


ఇలాంటి పరిస్థితుల్లో రంగంలోకి దిగుతున్న షర్మిలా ను తక్కువగా అంచనా వేయకూడదని విశ్లేషకులుంటున్నారు.. విభజన తర్వాత కూడా వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసింది.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ తో పాటు 3 ఎమ్మెల్యే సీట్లును వైసీపీ గెలుచుకుంది.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ అనుచరులు నేతలుగా చలామణీ అవుతుంటే.. ప్రత్యేకంగా క్యాడర్ లోనూ వైఎస్సాఆర్ పై ఇప్పటిటీ ఆ క్రేజ్ ఉంది.. మరో వైపు గతంలోలాగా తెలంగాణ సెంటిమెంట్ కూడా ఇప్పుడు బలంగా లేదు.. ఈ పరిస్థితులు షర్మిలకు అనుకూలంగా మారోచ్చంటున్నారు.. 


ప్రధానంగా కాంగ్రెస్ కు సాంప్రదాయక ఓటు బ్యాంకుగా ఉండి అటు బిజెపికి వెళ్లలేక ఇటు టీఆర్ఎస్ కు జై కొట్టలేక సతమతమవుతున్న నేతలు, క్యాడర్ కు షర్మిలా కొత్త పార్టీ ఓ ఆప్షన్ లా కనిపిస్తోందంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కి లీడ్ పాయింట్ గా ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలు కూడా ఇక తెలంగాణలో కాంగ్రెస్ పనిఅయిపోయిందనే భావనకు వచ్చారంటున్నారు.. కొందరు నేతలు అటు ఇటు గా ఉన్నా.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన క్యాడర్ షర్మిలా పార్టీకి వెళ్లోచ్చనే ప్రచారం జరుగుతోంది.. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి యూత్ ఫాలోయింగ్ ఉంది.. కానీ అటు దేశంలో గానీ ఇటు తెలంగాణలో గానీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై అయోమయం... చివరి నిమిషంలో పీసీసీ అవుతాడనుకున్న తమ నేత రేవంత్ రెడ్డికి పదవి దక్కకపోవడంతో ఆయనను అభిమానిస్తున్న కాంగ్రెస్ క్యాడర్ కూడా అసంతృప్తిలో ఉందంటున్నారు.. అలాంటి కార్యకర్తలు కూడా షర్మిలా కు జై కొట్టే అవకాశం ఉందంటున్నారు.. రేవంత్ కు ప్రధాన మద్దతు దారులుగా ఉన్నా.. ఏపూరి సోమన్న ఇప్పటికే షర్మిలా కు మద్దతు ప్రకటించారు.. అలాగే చాలా మంది నేతలు క్యూలో ఉన్నట్లు సమాచారం.. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ చాలా మంది సీనియర్లు వైఎస్సాఆర్ లెగసీయే బెటర్ .. షర్మిలకు జై కొడితే పోలా... అనే భావనలో ఉన్నారంటున్నారు.. వీరికి తోడు.. క్రిస్టియన్స్ ,దళిత క్రిస్టియన్స్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో చీలిక వచ్చి షర్మిలకు కొందరు మద్దతు తెలిపే అవకాశం ఉందంటున్నారు.. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల సమీక్షలు పూర్తి చేసిన షర్మిలా.. కొన్ని వర్గాలను కూడా కలిశారు.. ఏదో ఆషామాషీగా కాకుండా సీరియస్ గానే షర్మిలా కొత్త పార్టీ ప్రయత్నాలు జరుగుతున్న దరిమిలా.. ఖచ్చితంగా ఎన్నికల నాటికి షర్మిలా కొత్త పార్టీ ప్రభావం గట్టిగా ఉంటుందని భావిస్తున్నారు...

Comments

Popular posts from this blog

సాయంత్రం 7తో బంద్! ఏపీ లో కోవిద్ మార్గదర్శకాలు

IAS transfers in ap ఏపీ లో ఐఏఎస్ ల బదిలీలు

Jagan cabinate expansion likely in november! 7 ministers continue