నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్! రేపో మాపో అధికారిక ప్రకటన
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ రేపో మాపో అధికారిక ప్రకటన
తెలంగాణలో ఉప ఎన్నిక జరుగుతున్న నాగార్జున సాగర్ నుంచి బరిలో దిగే టీఆర్ఎస్ అభర్థి ఎవరనేదానిపై సస్పెన్స్ కు తెరదిగింది.. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు నోముల భగత్ ను పోటీలో దించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావడమే తరువాయి.. గురవయ్య యాదవ్ పేరు చివరి వరకు పరిశీలనకు వచ్చినా.. ప్రస్తుతం అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు , సామాజిక సమీకరణాల దృష్ట్యా నోముల భగత్ కే టిక్కెట్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారంటున్నారు.. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిగా రంగంలో ఉన్న మాజీ మంత్రి జానారెడ్డిని ఢీకొట్టెందుకు అన్ని రకాలుగా బలమైన అభ్యర్థినే రంగంలో దించాలని సీఎం అనుకున్నప్పటికీ.. అభ్యర్థి ఎవరైనా గెలుపు ఖాయమనే వ్యూహాంతో ముందుకెళ్లాలని .. ఓ నిర్ణయానికొచ్చినట్లు చెబుతున్నారు.. నోముల నర్సింహాయ్య పై చెప్పుకోదగ్గ రీతిలో వ్యతిరేకత లేకపోవడం.. నోముల భగత్ కు టిక్కెటివ్వడం ద్వారా మంచి సంకేతాలు పోతాయని.. దీనికి పక్కా వ్యూహాం తోడైతే ఖచ్చితంగా గులాబీ జెండా రెపరెపలాడుతుందని సీఎం యోచిస్తున్నట్లు చెబుతున్నారు.. గురవయ్య యాదవ్ తో పాటు రంజిత్ యాదవ్, కోటి రెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. చివరికి నోముల భగత్ కే సీఎం పచ్చజెండా ఊపారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.. ఈనెల 30న భగత్ నామినేషన్ వేసే అవకాశముందంటున్నారు..

Comments
Post a Comment