కిలో బంగారు మంగళ సూత్రం!
One kilo gold mangalsutra పెళ్లైన హిందూ మహిళలు మంగళసూత్రం ధరించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి ఒక్కరూ తమ తాహతును బట్టి తులమో.. 5 తులాలో.. మరీ డబ్బులు ఎక్కువగా ఉంటే 10 తులాలబంగారు మంగళసూత్రాన్ని చేయించుకుని మెడలో వేసుకుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు ఏకంగా కేజీ బంగారంతో తయారుచేయించిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. దాన్ని ఆ మహిళ మెడలో ధరించి వీడియో తీసుకోగా.. అది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని బివాండీకి చెందిన బాలా అనే వ్యక్తి తన భార్యకు కేజీ బంగారంతో తయారుచేసిన మంగళసూత్రాన్ని కానుకగా ఇచ్చాడు. మోకాళ్ల వరకు పొడవున్న ఆ బంగారు మంగళసూత్రాన్ని ధరించి ఆమె, భర్తతో కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకుంది. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు బాలాను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అతడు చెప్పిన విషయం విని అంతా షాకయ్యారు. తన భార్యకు కానుకగా ఇచ్చిన మంగళసూత్రం గిల్టుదని, దాన్ని ఓ బంగారు షాపు నుంచి రూ.38వేలకు కొన్నట్లు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. బంగారు షాపు నిర్వాహకులను విచారించగా...