గూగుల్ పే ద్వారా అమెరికా నుంచి భారత్ కు ఈజీగా మనీ ట్రాన్స్ ఫర్.
Easy Money transfer through google pay from US to India
గూగుల్ పే యాప్ వినియోగదారులు ఇక నుంచి అమెరికా నుంచి భారత్, సింగపూర్ యూజర్లకు డబ్బులు పంపే వెసులుబాటును ఆ సంస్థ కల్పించింది. ఈ మేరకు యూజర్లకు ఈ సదుపాయాలు కల్పించేందుకు ఆర్థిక సేవల సంస్థలు వెస్ట్రన్ యూనియన్, వైజ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు టెక్‌క్రంచ్ మొదట ఓ కథనాన్ని ప్రచురించింది.
అనంతరం గూగుల్ పే కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతేగాక, ఆర్థిక సేవల సంస్థలు వెస్ట్రన్ యూనియన్ తో నగదు బదిలీ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఇకపై అమెరికా యూజర్లు మరో 200 దేశాలకు, వైజ్ ద్వారా 80 దేశాలకు డబ్బు పంపే సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని గూగుల్ పే చెప్పింది.
#googlepay #US #India #money transfer

Comments
Post a Comment