జనసేన సంచలనం! అభ్యర్థి లేకుండానే గెలుపు
పశ్చిమ గోదావరి లో జనసేన సంచలనం! #janasena #apparishatpolls #pavankalyan
పశ్చిమ గోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలన విజయం నమోదు చేసుకుంది. పెంటపాడు మండలం రావిపాడు ఎంపీటీసీ పదవి వద్దన్నా పార్టీని వీడిన వ్యక్తినే వరించింది. అక్కడ ఉన్న ఒక్క నేత అధికార వైసీపీలోకి జంప్ అయ్యాడు. అధికార పార్టీ అభ్యర్ధిని గెలిపించాలని మరీ ప్రచారం చేశాడు. అభ్యర్ధి లేకపోయినా జనసేనను గెలిపించుకుందామని కార్యకర్తలు శ్రమించారు. ఆదివారం జరిగిన కౌంటింగ్‌లో ఫలితం చూసి అందరు ఖంగుతిన్నారు. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి ఓట్లు లెక్కించడంతో జనసేన పార్టీ అనూహ్య విజయం సాధించింది. పార్టీని వదిలి వెళ్లిన జనసేన నాయకుడు బొచ్చెల తాతారావు గెలుపొందాడు.

Comments
Post a Comment