సైదాబాద్ కిల్లర్ ఆత్మహత్య!

Saidabadgirlkiller commits sucide 



చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్‌పై  రాజు మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుడి చేతిపై మౌనిక అనే పేరుతో ఉన్న టాటూ ఆధారంగా అతడు హత్యాచార నిందితుడు రాజు అని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.


ఆరోజు ఏం జరిగిందంటే..

ఈ నెల 9వ తేదీన రాజు మాదన్నపేటలో  భవన నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. పొద్దున 9 గంటలకు వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు తన గదికి తిరిగొచ్చాడు. సాయంత్రం 4.30-5 గంటల మధ్యలో చిన్నారికి మాయ మాటలు చెప్పి తన రూమ్‌కు తీసుకొచ్చి లైంగికదాడి జరిపాడు. ఆమె అరుస్తుంటే గొంతు నులిమి చంపేశాడు. తర్వాత గదికి తాళం వేసి బయటకు వచ్చిన రాజు.. తాగిన మైకంలో అదే ప్రాంతంలో తచ్చాడాడు. సాయంత్రం 7గంటలకు స్థానికంగా ఉన్న పానీపూరి బండి వద్ద పానీ పూరి తిన్నాడు. అప్పటికే సింగరేణి కాలనీ వాసులందరూ పాప కోసం వెతుకుతున్నారు. రాత్రి 9 గంటలకు చిన్నారి నాయనమ్మను చూసిన రాజు.. పాప కనిపించిందా? అని ప్రశ్నించాడు. తాగిన మత్తులో రోడ్డుపై వెళ్తున్న అతను అలా ప్రశ్నించడంతో పాప నాయనమ్మకు అనుమానం వచ్చి ఇంట్లోవాళ్లకు చెప్పింది. దీంతో వారు.. పాప చెవికి ఉన్న బంగారు దుద్దుల కోసం అతడు తమ కుమార్తెను తీసుకోపోయి ఉండొచ్చని అనుమానించిన కుటుంబసభ్యులు ఆ విషయాన్ని స్థానికులకు చెప్పారు. విషయం తెలిసిన రాజు మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు.#saidabadgirlkiller #rapistraju #rajusucide 


స్థానికుల సాయంతో కుటుంబసభ్యులు రాజు ఉంటున్న గది వద్దకు వెళ్లగా.. గదికి తాళం వేసి ఉంది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికులు గది తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు వద్దన్నారు. రాత్రి 12 గంటల దాకా వెతికి ఆ తర్వాత గది తాళం పగలగొట్టడంతో పాప మృతదేహం కనిపించింది. రాత్రి 9 గంటల సమయంలోనే తాళం పగలగొట్టి ఉంటే పాప ప్రాణాలతో దక్కి ఉండేదేమోనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. పాప అప్పటికే చనిపోయి ఉంటుందని, ఆమె మృతదేహాన్ని ఎక్కడైనా పారేయడానికి వీలుగా చుట్టి ఉంచాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు

Comments

Popular posts from this blog

సాయంత్రం 7తో బంద్! ఏపీ లో కోవిద్ మార్గదర్శకాలు

IAS transfers in ap ఏపీ లో ఐఏఎస్ ల బదిలీలు

Jagan cabinate expansion likely in november! 7 ministers continue