టీవీ 5 చైర్మన్ బి ఆర్ నాయుడు పై వైసీపీ ఎంపీలు ఫిర్యాదు
Ycp mps camplaint pm and fm on tv5 chairman and RRR
లోక్‌సభ సభ్యుడు శ్రీ కె.రఘురామకృష్ణరాజు, టీవీ5 న్యూస్ ఛానల్ ఛైర్మన్ శ్రీ బిఆర్ నాయుడుపై ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఫిర్యాదు:
లోక్‌సభ సభ్యుడు శ్రీ కె.రఘురామకృష్ణరాజు , టీవీ5 న్యూస్ ఛానల్ ఛైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు మధ్య ఒక మిలియన్ యూరోల మోసపూరిత హవాలా లావాదేవీలపై పక్కాగా ఆధారాలు:
ఇది మనీ లాండరింగ్ నివారణ చట్టం (పీఎంఎల్‌ఏ), విదేశీ మారకద్రవ్య యాజమాన్య చట్టం (ఎఫ్‌ఈఎంఏ–ఫెమా). యథేచ్ఛగా రెండు చట్టాల ఉల్లంఘన. అందువల్ల వెంటనే తగిన చర్యలు తీసుకోండి:
వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి వైయస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు. కీలక ఆధారాల సమర్పణ:
లోక్‌సభ సభ్యుడు శ్రీ కె.రఘురామకృష్ణరాజు, టీవీ5 న్యూస్ ఛానల్ ఛైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు మధ్య ఒక మిలియన్ యూరోల మోసపూరిత హవాలా లావాదేవీలపైవైయస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదులోని ముఖ్యాంశాలు:
– ఎంపీ శ్రీ కె.రఘురామకృష్ణంరాజు, టీవీ5 న్యూస్ ఛానల్ ఛైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు మధ్య చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ మనీ లాండరింగ్‌పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు పలు సాక్ష్యాధారాలు సేకరించారు.
– తమ దర్యాప్తులో భాగంగా మంగళగిరిలోని ఏపీ సీఐడీ పోలీసులు, కేసులో ప్రధాన నిందితుడి ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడు పది లక్షల యూరోల అక్రమ హవాలా వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి.
– ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్) అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా ఈ ఫిర్యాదుతో జతపర్చాము.
– ఈ కేసులో మొదటి నిందితుడు (ఏ–1) ఎంపీ శ్రీ కె.రఘురామకృష్ణంరాజు కాగా, రెండో నిందితుడు (ఏ–2) శ్రీ బిఆర్.నాయుడు. వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ ఛాటింగ్, ఈ పది లక్షల యూరోల అక్రమ మనీ లాండరింగ్‌ను బట్టబయలు చేసింది.
– వెల్స్ ఫార్గో ఖాతా నెం: 51700263205 నుంచి పది లక్షల యూరోలను ఓసీబీసీ ఖాతా నెం: 501189518301కు బదిలీ చేసినట్లు ఆ ఫోన్ ఛాటింగ్ తేలతెల్లం చేసింది. అంతే కాకుండా ఇది పీఎంఎల్‌ఏ యథేచ్ఛ ఉల్లంఘనకు రుజువుగా నిలుస్తోంది.
– ఇద్దరు నిందితుల మధ్య జరిగిన కోట్ల రూపాయల మోసపూరిత హవాలా లావాదేవీలకు సంబంధించి, ఈ ఫిర్యాదు పత్రంతో జత చేసిన ఆధారాల పేజీ నెంబర్లు 2, 3 లో ఛాటింగ్ వివరాలు ఉన్నాయి.
– తనకు ఇప్పటి వరకు ఒక్కటి (కోటి రూపాయలు) మాత్రమే ఇవ్వగా, ఇంకా పది (పది కోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉందంటూ, కేసులో ఏ–1 అయిన ఎంపీ శ్రీ కె.రఘురామకృష్ణంరాజు, ఏ–2 అయిన శ్రీ బిఆర్ నాయుడును ఫోన్ ఛాటింగ్‌లో కోరడం ఈ ఫిర్యాదుతో జత చేసిన ఆధారాల పేజీ నెం:4లో వివరంగా ఉంది.
– ఆ విధంగా మొత్తం దాదాపు రూ.11 కోట్లు (పది లక్షల యూరోలు) శ్రీ బిఆర్ నాయుడు, ఎంపీ శ్రీ కె.రగురామకృష్ణంరాజుకు ఇచ్చినట్లు రుజువు చేసిన ఫోన్ ఛాటింగ్, మేము సమర్పించిన ఆధారాలలో పేజీ నెం:5 లో స్పష్టంగా ఉంది.
అందువల్ల మీరు వెంటనే స్పందించి, ఈ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
– ఎంపీ శ్రీ కె.రఘురామకృష్ణంరాజు, శ్రీ బిఆర్ నాయుడుపై పీఎంఎల్‌ఏ–2002, ఫెమా–1999 ఉల్లంఘన కింద వెంటనే కేసులు నమోదు చేయాలి.
– కేసులో ఏ–1 నిందితుడైన ఎంపీ శ్రీ కె.రఘురామకృష్ణంరాజు దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకోవాలి.
– అతడిని కస్టడీలోకి తీసుకుని మోసపూరిత, అక్రమ హవాలా లావాదేవీలన్నింటి వివరాలు పూర్తిగా రాబట్టాలి.
వీలైనంత త్వరగా ఈ చర్యలన్నీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని వైయస్సార్‌సీపీ ఎంపీలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు తమ ఫిర్యాదును స్పష్టమైన ఆధారాలతో సహా ప్రధాని శ్రీ నరేంద్రమోదీతో పాటు, కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు.

Comments
Post a Comment