టీవీ 5 ఎండీ రవీంద్రనాథ్ పై కేసు!
జూబ్లీహిల్స్ కోపరేటివ్ అధ్యక్షుడు రవీంద్రనాథ్ పై కేసు
జూబ్లీహిల్స్ కోపరేటివ్ అధ్యక్షుడు , టీవీ5 ఎండి ravindra నాయుడు పైన పోలీసు కేసు నమోదయ్యింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదు చేశారు . జూబ్లీహిల్స్ కోపరేటివ్ సభ్యుడు సురేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని అతి తక్కువ ధరకే ఆరోపణలు చేశారు. సర్వసభ్య సమావేశం నిర్వహించకుండానే గుట్టుచప్పుడు కాకుండా 355 గజాల స్థలాన్ని పార్వతి దేవి అనే మహిళకు అమ్మేశారని సురేష్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు . దాదాపు ఏడు కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కోటి 65 లక్షల రూపాయలకు పేర్కొన్నారు. జిహెచ్ఎంసి కి సంబంధించిన పార్కు స్థలాన్ని సొసైటీ స్థలంగా చూపెట్టి అమ్మకాలు జరపా రంటూ సురేష్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. .
టివీ5 రవీంద్రనాథ్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. కోట్లాది రూపాయల భూమిని తక్కువ ధరకు అమ్మి టివీ 5 రవీంద్రనాథ్ (టీవీ5) సొమ్ము చేసుకున్నారని సురేష్ బాబు అనే వ్యక్తి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు .అసలు సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా గుట్టుచప్పుడు కాకుండా మూడు వందల యాభై గజాల స్థలాన్ని పార్వతి దేవి అనే మహిళకి కి అమ్మేశారు. కోట్ల రూపాయలను జేబులో వేసుకున్నారు. అయితే కోట్లాది రూపాయల స్థలాన్ని గజం 45 వేలకు పార్వతి దేవి కి విక్రయించారని దీని వల్ల సొసైటీ కి 5 కోట్ల మేర నష్టం జరిగిందని సురేష్ బాబు అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్ర నాయుడు తో పాటు కోశాధికారి నాగరాజు పై కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడే ఇంకొక వివాదం తెరపైకి వచ్చింది తమ స్థలం కబ్జాకు గురైదంటు జిహెచ్ఎంసి అధికారులు కూడా ఫిర్యాదు చేశారు.సదరు స్థలం జిహెచ్ఎంసి కి సంబంధించిందని అందులో నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు.



Comments
Post a Comment