Posts

Showing posts from November, 2021

ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్(72) కన్నుమూత

Image
 హైదరాబాద్ : ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్(72) కన్నుమూత కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన శివశంకర్ మాస్టర్  ఇటీవల కరోనా భారినపడ్డ శివశంకర్ మాస్టర్ కుటుంబం కరోనాతో పోరాడుతున్న శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్  చెనైలో 7 డిసెంబర్ 1948లో పుట్టిన శివశంకర్  శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా పనిచేసిన శివశంకర్ మాస్టర్  భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చిన శివశంకర్ మాస్టర్  800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన శివశంకర్  దాదాపు 30 చిత్రాల్లో నటించిన శివ శంకర్ మాస్టర్ 2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్న శివశంకర్ మాస్టర్  శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన చిత్రాలు: అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్

టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

Trs local body mlc list released   టీఆర్ఎస్  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు *దాదాపు* ఖరారు. ఢిల్లీవెల్లే ముందు అభ్యర్దులను ఖరారు  చేసిన కేసీఆర్.  #పలువురు  అభ్యర్దులకు బీ ఫాం ఇచ్చిన కేసీఆర్.. #రేపు అధికారికంగా ప్రకటించనున్న టీఆర్ఎస్ అధిష్ఠానం.  #రేపు ఎల్లుండి  నామినేషన్లు వేయనున్న పలువురు అభ్యర్దులు.  #పలుజిల్లాల్లో కొందరికి రెన్యూవల్ మరికొందరికి మొండిచెయ్యి.  # ఆదిలాబాద్ - దండే విఠల్ #మహబూబ్ నగర్:  సాయిచంద్, కసిరెడ్డి నారాయణ రెడ్డి.  #ఖమ్మం- తాత మధు #రంగారెడ్డి -శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి. # వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి #నల్గొండ- ఎం సి కోటిరెడ్డి. #  మెదక్-  డాక్టర్ యాదవ రెడ్డి # కరీంనగర్ - ఎల్ రమణ, భాను ప్రసాద్ రావు.  # నిజామాబాద్ - కల్వకుంట్ల  కవిత అభ్యర్థిత్వం పై ఇంకా రాని క్లారిటి.  # నిజామాబాద్ లో కల్వకుంట్ల కవిత వద్దనుకుంటే ఆకుల లలిత కు అవకాశం. #trs #localbodymlc #trscandidates 

ఎస్పీ చరణ్ వ్యాఖ్యత గా ఈటీవీ లో పాడుతా తీయగా

Image
Sp charan will Host padutaa teeyagaa ఎస్పీ.బాలు లేకుండా చరణ్‌ సారథ్యంలో... తెలుగుసినీ సంగీత వాకిలి, మధురగీతాల జావళి. యువ గాయకుల లొగిలి ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం.  25 ఏళ్లక్రితం బాలు గారి చేతుల మీదుగా ప్రారంభమైందీ ఈ సంగీత యజ్ఞం. 18 సీజన్లు అప్రతిహతంగా సాగిన ఈ స్వరధుని వేల ప్రతిభావంతులను సమాజానికి పరిచయం చేసింది. త్వరలో ప్రారంభంకానున్న 19వ సీజన్ పాడుతా తీయగా కోసం ఈటీవీ భారీ కసరత్తు చేసింది. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌ ఆడిషన్స్ నిర్వహించింది. 4 వేలమంది గాయనీగాయకుల స్వరాలను నిర్ణేతల పరీక్షించి వారిలో నుంచి 16 మంది కళాకారులను ఎంపిక చేశారు. #spcharan #spbalu #padutaateeyagaa #etv  కొద్దిరోజుల్లో కనుల, వీనులపండుగా ఈటీవీ బుల్లితెరపై ప్రసారం కానున్న ఈ రియాలిటీ షోను నిర్వహించే బాధ్యతను బాలు కుమారుడు ఎస్‌పీ చరణ్ స్వీకరించటం విశేషం. దీనికి సింబాలిక్‌గా బాలు తొలి వర్థంతి రోజున రామోజీరావు చేతుల మీదుగా చరణ్‌ మైక్‌పీస్ అందుకున్నారు. మేటి గాయకులను ఎంపిక చేసేందుకు సినీసంగీత సామ్రాజ్యంలో సెలబ్రిటీలుగా ఎదిగిన చంద్రబోస్, సునీత, విజయ్‌ప్రకాష్‌లు పాడుతా తీయగా జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు. ఈ షోలో చ...

కొంపముంచిన యాడ్! అల్లు అర్జున్ కు టీఎస్ ఆర్టీసీ నోటీసు

Image
Tsrtc notice to hero allu arjun  టి.యస్ ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్, రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ...యూట్యూబ్ లో  ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు.‌ ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ పేర్కొన్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని ఆయన‌ అన్నారు. *సజ్జనార్ మాట్లాడుతూ*.. టిఎస్ఆర్టిసిని కించపరచడాన్ని సంస్థ యాజమాన్యం ,  ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు సహించరు.  వాస్తవానికి మెరుగైన, పరిశుభ్రమైన పర్యావరణ సమాజం కోసం ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో యాక్టర్స్ ...